Odisha: భర్తల వేధింపులు తాళలేక ఎందరో మహిళలు సతమతం అవుతున్న వైనం మనకు తెలుసు. భార్తల ఆగడాలకు ఆగమైన కుటుంబాలను మనం కళ్లారా చూశాం. మద్యానికి బానిసలైన ఎందరో మగవాళ్లు తమ భార్యలను నిత్యం చితకబాదుతూ, కుటుంబ సభ్యులతో ఘర్షణలకు పాల్పడుతూ ఇబ్బందుల పాలు చేస్తున్న వైనాలు నిత్యకృత్యం. తాగిన మైకంలో క్షణికావేశంతో కుటుంబ సభ్యులను హతమార్చిన ఘటనలు కోకొల్లలు. ఇప్పటికీ తాగుబోతు భర్త వేధింపులు తాళలేని ఎందరో మహిళలు పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు పెడుతున్న ఘటనలు రోజూ ఉంటూనే ఉన్నాయి. కానీ, ఇదే విషయం ఇక్కడ తిరగబడింది. అదేమిటో తెలుసుకుందాం రండి.
Odisha: ఇక్కడ అలా కాదు.. మొదటి అంశం తిరగబడింది. అదేనండీ కొందరు పురుషులు తమ భార్యలపై ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్టెక్కారు. తమ భార్యల వేధింపులు తాళలేకపోతున్నామని మూకుమ్మడిగా ఫిర్యాదులు చేశారు. జిల్లా అధికారులకు కూడా తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. సుమారు డజన్ మందికి పైగా ఈ ఫిర్యాదులు చేసినవారిలో ఉన్నారు.
Odisha: ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా జూజారిపుట్ పంచాయతీ పరిధిలోని కొండగూడ గ్రామంలో తమ భార్యలు మద్యానికి బానిసలు అయ్యారని ఆ మహిళల భర్తలు పోలీసులకు, ఆబ్కారీ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భార్యలు మద్యానికి బానిసలై నిత్యం తమకు చుక్కులు చూపిస్తున్నారని మొరపెట్టుకున్నారు. ఇంకో షాక్ కలిగించే విషయం ఏమిటో తెలుసా? తాము కష్టపడి కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే తమ భార్యలు ఆ డబ్బులతో ఎంచక్కా మందు తాగుతున్నారని వారి ఆవేదన.
Odisha: చూశారా మొదటి దాంట్లో వారే సంపాదించి, అందులోనే నగదును ఖర్చు చేస్తుంటే, ఇక్కడేమో భర్తలు సంపాదిస్తుంటే ఏకంగా భార్యలే మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఆ గ్రామంలో కొందరు నాటుసారాను విపరీతంగా తయారు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని సారా తయారీని నిర్మూలిస్తే తమ భార్యలు సేఫ్ అవుతారని అధికారులను ఆ భార్యాబాధిత భర్తలు వేడుకున్నారట. ఇప్పటికైనా ఆ ఊరిలో నాటుసారా నిర్మూళన జరిగి, ఆ భార్యా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.