Numaish Exibition

Numaish Exibition: వామ్మో.. అరగంట పాటు గాలిలో తల్లకిందులుగా ప్రాణాలు..ఎగ్జిబిషన్ లో తప్పిన ప్రమాదం!

Numaish Exibition: సరదా పడితే.. నరకం కనిపించింది. ఎగ్జిబిషన్ లో సరదాగా తిరుగుతూ.. అక్కడ ఉన్న రకరకాల రైడ్స్ లో ఎంజాయ్ చేయడం కోసం చాలామంది ఉత్సాహ పడతారు. ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడ ఔత్సాహికుల కోసం ఎన్నోరకాల రైడ్స్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ కు ప్రతిరోజూ వందలాది మంది వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఒక ఎమ్యూజ్మెంట్ రైడ్ లో కొందరు విజిటర్స్ కు చేదు అనుభవం.. ఇంకా చెప్పాలంటే భయంకర అనుభవం ఎదురైంది. 

Numaish Exibition: నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఎమ్యూజ్మెంట్ రైడ్ లో గురువారం సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక ఎమ్యూజ్మెంట్ రైడ్ జరుగుతుండగా.. అకస్మాత్తుగా అది ఆగిపోయింది. దీంతో పైవైపు ఉండిపోయిన రైడర్స్ తల్లకిందులుగా ఉండిపోయారు. ఒక్కసారిగా రైడ్ ఆగిపోవడంతో అక్కడ కలకలం రేగింది. బ్యాటరీలోని సాంకేతిక సమస్యతో అనుకోకుండా రైడ్ ఆగిపోయింది. దీంతో నిర్వాహకులు వెంటనే చిక్కుకుపోయిన వారిని కిందకు దించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాదాపు అరగంట సేపు శ్రమ పడిన తరువాత వారిని రక్షించగలిగారు. ఈ అరగంట సేపు పర్యాటకులు తల్లకిందులుగా ఉండిపోయారు. వారు కిందికి వచ్చిన తరువాత బతుకు జీవుడా అనుకుంటూ వెనుతిరిగారు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్రమైన గాయాలు అయిన సమాచారం లేదు. నిర్వాహకులు బ్యాటరీ సమస్య కారణంగా ఇలా జరిగిందనీ, తరువాత సమస్య పరిష్కరించామనీ చెప్పారు. 

సీశాట్ న్యూస్ తన X పోస్ట్ లో షేర్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: సంద‌డికి నెక్లెస్ రోడ్‌ రెడీ.. ప్ర‌జా విజ‌యోత్స‌వాల్లో మెర‌వ‌నున్న తార‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *