Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ వెలుపల రోగులతో సమావేశమయ్యారు. రోగుల బాగోగులను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. “ వ్యాధి భారం, కొరికే చలి, ప్రభుత్వ సున్నితత్వం – ఈ రోజు చికిత్స కోసం చాలా దూరం నుండి వచ్చిన AIIMS వెలుపల రోగులను,వారి కుటుంబాలను కలిశాను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు తన పోస్ట్ కు.
Rahul Gandhi: అంతేకాకుండా చికిత్సకు వెళ్లే మార్గంలో, వారు వీధులు, కాలిబాటలు, సబ్‌వేలపై పడుకోవలసి వస్తుంది – చల్లని నేల, ఆకలి, అసౌకర్యం ఉన్నప్పటికీ ఆశల జ్వాలని మండిస్తూనే ఉంటారు. ప్రజల పట్ల తమ బాధ్యతలను నెరవేర్చడంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఆరో జాబితా..
Rahul Gandhi: కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇద్దరు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. ఇందులో తిమార్‌పూర్ నుంచి లోకేంద్ర చౌదరి, రోహతాస్ నగర్ నుంచి సురేష్‌వతి చౌహాన్‌లకు టికెట్ ఇచ్చారు. దీంతో మొత్తం 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అంతకుముందు, బుధవారం అర్థరాత్రి, ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జనవరి 14న కాంగ్రెస్ నాలుగో జాబితాను విడుదల చేసింది. అందులో 16 మంది పేర్లు ఉన్నాయి.
Rahul Gandhi: జనవరి 3, 2025న కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. ఇందులో కల్కాజీ అసెంబ్లీ నుంచి సీఎం అతిషిపై అల్కా లాంబను అభ్యర్థిగా నిలబెట్టారు. అల్కా, అతిషి ఇద్దరూ జనవరి 14న నామినేషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 24న కాంగ్రెస్ రెండో జాబితాను విడుదల చేసింది. అందులో 26 మంది పేర్లు ఉన్నాయి. డిసెంబర్ 12న తొలి జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.