TG Govt: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భూసేకరణ రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… 24 గంటలకు గడవక ముందే అక్కడ రైతులకు మరో షాక్ ఇచ్చింది. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణను రద్దు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో అక్కడ గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 24 గంటలు గడవక ముందే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్ ఇస్తూ రైతులను షాక్‌కు గురి చేసింది. ఫార్మా విలేజ్ కోసం బలవంతంగా భూములు తీసుకోవడంతో గిరిజన రైతులు ఎదురు తిరిగారు.తమ భూములు ఇచ్చేది లేదని భూ సేకరణకు వచ్చిన అధికారులను తరిమికొట్టారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ కుట్రతోనే అధికారులపై దాడి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు దాడి చేసినా ఫలితం కల్పించలేదు. లగచర్ల కుట్రలో భాగముందనీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు 28 మంది గిరిజన రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. లగచర్ల బాధితులు ఢిల్లీ కేంద్రంగా ఫిర్యాదులు చేయడంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు కేంద్ర మానవ హక్కుల సంఘం విచారణ చేపట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
ఇది కూడా చదవండి: Gold rate: హెచ్చుతగ్గులతో పసిడి.. తులం ఎంతంటే..
TG Govt: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూ సేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఫార్మా అంటే కాలుష్య భయం… అనేక అనుమానాలు ఉంటాయి. అందుకే ప్రజలకు ఉపాధి కల్పించే పారిశ్రామిక కారిడార్‌కు ఎలాంటి అపోహలు ఉండవని ప్రభుత్వం భావిస్తూ… కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు రైతులు మాత్రం తమ భూములు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
One Reply to “TG Govt: లగచర్ల భూసేకరణ..నిన్న రద్దు..నేడు నోటిఫికేషన్ విడుదల”