Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకే ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. ఉంటున్న ఊర్లో ఉద్యోగాలు లేకపోవడంతో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన భార్య అంజలి (21), వినయ్ (23) జంట.
ఇక్కడికి వచ్చిన తర్వాత భార్య మరో వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందేమో అని అనుమానంతో భార్యతో గొడవ పడేవాడు. ఇన్ని రోజులు ప్రేమించుకున్న తన పైన అనుమానం తెచ్చుకోవడం, తరచుగా తిట్టడం తట్టుకోలేకపోయింది అంజలి. తనకు కడుపు నొప్పి వస్తోందని భర్తకు చెప్పి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలియడంతో తన వల్లే అంజలి చనిపోయిందని, ఆమె మరణానికి కారణం తానే అనే మనస్తాపం చెందిన ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యల వెనుక నిజంగా అనుమానమే కారణమా లేక వేరేదైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
అనుమానం ముందు ఓడిపోయిన ప్రేమ. ఎన్ని ఏళ్లు ప్రేమించుకుంటే ఏమి లాభం? చిన్న అనుమానంతో ఇద్దరి జీవితాలు మధ్యలోనే ముగిశాయి. సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని పెద్దలు చెబుతున్నారు.
గమనిక: ఆత్మహత్య అన్నింటికీ పరిష్కారం కాదు… మీకు ఏదైనా మానసిక సమస్యలు ఉంటే 9152987821 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయండి
