Demonte Colony 3

Demonte Colony 3: న్యూ ఇయర్ కానుకగా డీమాంటే కాలనీ 3 ఫస్ట్ లుక్

Demonte Colony 3: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘డీమాంటే కాలనీ’ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది. 2015లో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా, తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగంతో ప్రేక్షకులను మరింత థ్రిల్ చేసింది. ముఖ్యంగా రెండో భాగంలో సామ్యూల్ ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యం, ఆస్తి కోసం రఘు పన్నే కుట్రలు, జూన్ 6వ తేదీన పుస్తకం చదివిన వారు చనిపోవడం వంటి అంశాలు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టాయి. తాజాగా ఈ సిరీస్‌లోని చివరి భాగమైన ‘డీమాంటే కాలనీ 3: ది ఎండ్ ఈస్ టూ ఫార్ ఎవే’ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వెలువడింది.

Also Read: Spirit: స్పిరిట్: రూత్‌లెస్ కాప్‌ ప్రభాస్!

నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2026న చిత్రబృందం విడుదల చేసిన ఈ మూడో భాగం ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పోస్టర్‌లో హీరో అరుళ్ నిధి పూర్తిగా దెయ్యంగా మారిపోయి, భయంకరమైన చూపులతో ‘డీమాంటే రాయల్ ఛైర్’పై కూర్చున్న తీరు భీతిని కలిగిస్తోంది. గత రెండు భాగాలను మించి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల సహాయంతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. మాస్టర్‌మైండ్ అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్యామ్ సీఎస్ తన సంగీతంతో భయాన్ని మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు.

ఈ చిత్రంలో పాత తారాగణమైన అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండ్యన్, మీనాక్షి గోవిందరాజన్ కొనసాగుతుండగా, కొత్తగా మలయాళ నటి మియా జార్జ్, అర్చనా రవిచంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రెండో భాగం ముగింపులో మిగిలిపోయిన చిక్కుముడులను ఈ మూడో భాగంలో వీడదీయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆ రహస్య పుస్తకం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? డీమాంటే ఆత్మ ప్రభావం నుంచి హీరో ఎలా బయటపడతాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ ఏడాది ఆగస్టులో సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *