New Year-2026:

New Year-2026: న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో పాల్గొంటున్నారా? మీకు ఈ 10 నిబంధ‌న‌లు తెలియాల్సిందే..

New Year-2026: 2025 సంవ‌త్స‌రానిక వీడ్కోలు ప‌లుకుతూ 2026 సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతూ డిసెంబ‌ర్ 31న అంత‌టా అంగ‌రంగ వైభ‌వంగా వేడుక‌లు జ‌రుగ‌నున్నాయి. ఊరూరా, వాడ‌వాడ‌నా కేక్‌లు క‌ట్ చేసి స్వీట్లు పంచుకుంటారు. ఈ వేడుక‌ల సంద‌ర్భంగా తాగి, తిని, ఆడేందుకు పెద్ద ఎత్తున ఇష్ట‌ప‌డుతారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు స‌హా గ్రామాల్లోనూ వేడుక‌లు పెద్ద ఎత్తున జ‌రుపుకునేందుకు ఇప్ప‌టికే సిద్ధ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా తెలంగాణ‌ పోలీస్ శాఖ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మైంది.

New Year-2026:నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకునే వారికి ఇప్ప‌టికే రాష్ట్ర‌ పోలీస్ శాఖ త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను జారీచేసింది. ఇత‌ర‌ ప్ర‌జ‌ల‌కు హాని చేయ‌కుండా, నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌కుండా న్యూఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని పోలీస్ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఎవ‌రైనా అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆదేశాలు జారీచేశారు. అనుమ‌తిలేని చోట్ల వేడుక‌లు నిర్వ‌హిస్తే అంద‌రిపైనా కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీచేశారు. పోలీసుల నిబంధ‌న‌లు, హెచ్చ‌రిక‌లు కింది విధంగా ఉన్నాయి.

1) నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల‌ను అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
2) ప్ర‌తి వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియ‌మాలు పాటించాలి
3) అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో సాయంత్రం 6 గంట‌ల నుంచి వాహ‌నాల త‌నిఖీ, డ్రంక‌న్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి
4) బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎక్క‌డైనా మ‌ద్యం సేవించ‌వ‌ద్దు
5) ఫామ్‌హౌస్‌, క్ల‌బ్బులు, గేటెడ్ క‌మ్యూనిటీల్లో అనుమ‌తి లేకుండా ఎలాంటి వేడుక‌లు నిర్వ‌హించ‌వ‌ద్దు
6) ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేసేలా ప‌టాకులు, అత్య‌ధిక మోతాదులో ఉండే సౌండ్ సిస్ట‌మ్ (డీజే) ఏర్పాటు చేయొద్దు
7) వాహ‌నాలు న‌డుపుతూ మైన‌ర్లు ప‌ట్టుబ‌డితే మైనరుపై, వాహ‌న య‌జ‌మానిపై కేసులు న‌మోదు చేస్తాం
8) త్రిబుల్ రైడింగ్ చేయొద్దు. పెద్ద శ‌బ్దాలు చేసే సైలెన్స‌ర్ల‌తో వాహ‌నాలు న‌డిప‌తే వాటిని సీజ్ చేస్తాం.
9) గుంపులు, గుంపులుగా రోడ్ల‌పై కేకలు వేస్తూ తిర‌గ‌డం, వాహ‌నాల‌తో ర్యాలీలు తీయ‌డం చేయొద్దు
10) రోడ్ల‌పై గుమిగూడి కేకులు క‌టింగ్‌, ట‌పాకులు కాల్చ‌డం చేయొద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *