Naveen Polishetty: చాలా కాలం క్రితం సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘అనగనగా ఒక రాజు’ అనే మూవీని ప్రకటించింది. నవీన్ పోలిశెట్టి హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలిపింది. తమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా చేయబోతోందనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. అయితే చిత్రంగా ఈ మూవీ ఆగిపోయిందనే పుకార్లు చాలా కాలంగా షికారు చేస్తూ వచ్చాయి. అందులో వాస్తవం లేదని, సైలెంట్ గా మూవీ పనులు చేస్తున్నామని మేకర్స్ ఇప్పుడో ప్రచార చిత్రాన్ని విడుదల చేసి చెప్పకనే చెప్పారు.
ఇది కూడా చదవండి: Chandra Babu Naidu: ఏపీ కి రావాల్సిన నిధులపై నిర్మలా సీతారామన్ తో బాబు చర్చ.
Naveen Polishetty: డిసెంబర్ 26న ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. రాజు గాడి పెళ్లి మామూలుగా ఉండదనే విషయం లేటెస్ట్ గా వచ్చిన బుల్లి ప్రచార చిత్రం చూస్తుంటే అర్థం అవుతోంది. నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్ అంటూ మేకర్స్ బాగానే హంగామా సృష్టిస్తున్నారు.