Bloody Romeo: ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాతో భారీ యాక్షన్ హంగామా సృష్టించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించారు. స్టైలిష్ యాక్షన్ సినిమాల దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) కోసం నాని సరికొత్త అవతారంలోకి మారారు.
‘రన్ రాజా రన్’, ‘సాహో’, ‘ఓజీ’ (OG) వంటి సినిమాలలో హీరోలను అత్యంత స్టైలిష్‌గా వెండితెరపై ప్రెజెంట్ చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుజీత్.. ఈసారి నానిని మునుపెన్నడూ చూడని అల్ట్రా స్టైలిష్, క్లాస్ లుక్‌లో చూపించబోతున్నారు.
ట్రెండీ హెయిర్‌స్టైల్.. సరికొత్త స్పెక్స్..
ఈ సినిమా కోసం నాని లుక్ ట్రాన్స్ఫర్మేషన్ను దర్శకుడు సుజీత్ స్వయంగా పర్యవేక్షించారు. నానిని ట్రెండీ హెయిర్‌స్టైల్, స్టైలిష్ కళ్లద్దాలతో సరికొత్త చార్మింగ్ గ్యాంగ్‌స్టర్‌గా తీర్చిదిద్దారు.
తాజాగా చిత్ర బృందం నానిపై ప్రత్యేక ఫొటోషూట్ పూర్తి చేసింది. పూర్తి లుక్‌ను బయటపెట్టకుండా కేవలం చిన్న గ్లింప్స్ రూపంలో విడుదల చేసినప్పటికీ, నాని ట్రెండీ అండ్ క్లాస్ అప్పియరెన్స్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రెండున్నరేళ్ల పాటు మాస్ అండ్ రా లుక్‌లో ‘ది ప్యారడైజ్’ చేసిన తర్వాత, నాని వెంటనే ఇలాంటి క్లాస్ అండ్ ట్రెండీ అవతారంలోకి మారడం సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
త్వరలోనే తెరుచుకోనున్న ‘కిచెన్’ – సెట్స్‌పైకి భారీ ప్రాజెక్ట్:
గతంలో విడుదల చేసిన అనౌన్స్మెంట్ గ్లింప్స్‌తోనే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
షూటింగ్ ప్రారంభాన్ని సూచిస్తూ.. ‘బ్లడీ రోమియో కిచెన్ త్వరలోనే తెరుచుకోనుంది’ (Bloody Romeo’s Kitchen is set to open very soon) అంటూ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద మరో ట్రెండీ బ్లాక్‌బస్టర్ విందును వడ్డించేందుకు నాని-సుజీత్ ద్వయం సర్వసన్నద్ధమవుతోంది.
