Nara lokesh: ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథకు జీవం పోసిన ప్రముఖ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గరివిడి లక్ష్మి’ మూవీ టీమ్ కి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌లు విశేష ఆదరణ పొందుతున్న వేళ, లోకేశ్ తన అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా చిత్ర యూనిట్‌ను మనస్ఫూర్తిగా ప్రశంసించారు.
కళనే జీవితంగా బతికిన కళాకారిణి.. నారా లోకేశ్ ట్వీట్
సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@anandhiactress @smayurk
https://t.co/4NMPO0sESM— Lokesh Nara (@naralokesh) October 10, 2026
