Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గాంధీనగర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పశ్చిమ తీరంలో అభివృద్ధి చెందిన గుజరాత్, తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే సముద్ర వాణిజ్యం, పారిశ్రామిక ప్రగతి సరికొత్త పుంతలు తొక్కుతాయని లోకేశ్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికగుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గాంధీనగర్‌లో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
1. కోస్ట్-టు-కోస్ట్ (Coast-to-Coast) ట్రేడ్ కారిడార్..
2. ‘గిఫ్ట్ సిటీ’ నమూనా & ఆర్థిక ప్రణాళికలు
విశాఖ, అమరావతిల అభివృద్ధి: గుజరాత్‌లోని అంతర్జాతీయ ఫైనాన్షియల్ టెక్-సిటీ (GIFT City) తరహాలోనే వైజాగ్, అమరావతిల్లో ఆధునిక బిజినెస్ డిస్ట్రిక్ట్‌లను నిర్మించే వ్యూహాలను వివరించారు.
పరిజ్ఞాన మార్పిడి: గిఫ్ట్ సిటీ సింగిల్-విండో క్లియరెన్స్, డెవలపర్ ఇన్సెంటివ్‌లు, నియంత్రణ విధానాల అవగాహనకు సహకరించాలని కోరారు.
క్లీన్ ఎనర్జీ & టెక్నాలజీ: ఏపీలో కాకినాడ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కొప్పర్తి మరియు ఓర్వకల్లు పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై వివరణ ఇచ్చారు.
3. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలు
అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయం: గుజరాత్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని గుజరాత్ సీఎంను కోరారు.
విజయవాడ పున్నమి ఘాట్ వద్ద జరగనున్న దసరా/విజయవాడ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు కూడా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా పాల్గొన్నారు.
