Mahila Maha Shakti

Mahila Maha Shakti: చీర, గాజులు” మాటలొద్దు! ఈ మెసేజ్‌ రోజాకు కూడా..

Mahila Maha Shakti: తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్‌ ఇంజనీరింగ్‌, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత.. ఇలా పార్టీలో, సమాజంలో వివిధ వర్గాల వారి ఉన్నతికి నారా లోకేష్‌ ప్రతిపాదించిన ఆరు శాసనాలకు ఆయా వర్గాల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే ఆరింటిలో అందర్నీ ఆకర్షిస్తోంది మాత్రం స్త్రీ శక్తి. ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం? మహిళల్ని ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నాం? రాజకీయాల్లో, పదవుల్లో ఉన్నప్పుడు మరింత ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి.. రోజా వంటి నేతలు.. తామూ మహిళలమే అని మర్చిపోయి మాట్లాడుతున్న మాటలేంటి? ఇక ట్రెండ్‌ మారుద్దాం.. మన ఇంటి నుండే మొదలు పెడదాం.. అంటూ లోకేష్‌ ఇచ్చిన అద్భుత సందేశం ఏంటి? లెట్స్‌ చెక్‌ దిస్‌ స్టోరీ. 

కడప గడ్డపై జరుగుతోన్న పసుపు పండగ, తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడులో “ప్రజలతోనే పార్టీ, తెలుగువారి కోసమే టీడీపీ” అన్న నినాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తూ.. పార్టీ, ప్రజాభివృద్ధి ధ్యేయంగా లోకేష్‌ ఆరు శాసనాలు ప్రతిపాదించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్‌ ఇంజనీరింగ్‌, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత.. ఇలా పార్టీలో, సమాజంలో వివిధ వర్గాల వారి ఉన్నతికి నారా లోకేష్‌ ప్రతిపాదించిన ఆరు శాసనాలకు ఆయా వర్గాల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే ఆరింటిలో అందర్నీ ఆకర్షిస్తోంది మాత్రం స్త్రీ శక్తి. ఈ “స్త్రీ శక్తి” శాసనం చేయడానికి ప్రాతిపదిక.. తెలుగు మహిళ. టీడీపీకి ఆది నుండీ అండగా ఉన్న వర్గమది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తెలుగింటి ఆడపడుచుకు ఆస్తి హక్కొచ్చింది. రిజర్వేషన్లు అందాయి. వారి చేతికి అధికార పగ్గాలు అందాయి. అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత పెరిగింది. చాలా మంది తెలుగు ఆడపడుచులకు అన్నగారు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా ఓ ఎమోషన్‌. దశాబ్దాలుగా కొనసాగుతున్న వారి సహకారానికి, ఆదరణకు పట్టం కడుతూ.. వారిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నదే లోకేష్‌ తీసుకున్న ఈ “స్త్రీ శక్తి” కాన్సెప్ట్‌. ఈ కాన్సెప్ట్‌ ఆల్రెడీ మంగళగిరిలో మహిళా మణులకు చేయూతనందించే కార్యక్రమంగా తన సొంత నిధులతో అమలు చేస్తున్నారు నారా లోకేష్‌. దీన్నిప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలందరికీ వర్తించేలా అమలు చేయాలన్నది లోకేష్‌ సంకల్పం.

అయితే ఈ “స్త్రీ శక్తి” శాసనాన్ని మహానాడు వేదికపై లోకేష్‌ ప్రకటించడంలోనూ ఓ ప్రత్యేకత కనబడింది. సమాజంలో మార్పు కేవలం చట్టాలు, శిక్షల వల్ల రాదని, వ్యక్తిగత మార్పు ద్వారానే సాధ్యమౌతుందని నొక్కి చెప్పిన లోకేష్‌… ఆ మార్పు ఇవాల్టి నుంచే, మన ఇంటి నుంచే మొదలవ్వాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేతులకు గాజులు తొడుక్కున్నావా, చేతకాకుంటే చీర కట్టుకుని ఇంట్లో కూర్చో, ఆడపిల్లలా ఏడుస్తున్నావేంటి.. ఇలాంటి పదాలు ముందు మనం మానేయాలన్నారు. ఆడపడుచుల్ని గౌరవించుకునే తెలుగు సంప్రాదాయలకు, స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే తెలుగు సంస్కృతికి.. అలాంటి మాటలు విరుద్ధమని, మన సంస్కృతి సంప్రదాయాలకే అవమానకరమని లోకేష్‌ చెప్పకనే చెప్పారు. ఇది విమర్శకుల్ని సైతం ఆకట్టుకున్న మంచి విషయం.

ఇది కూడా చదవండి: Supreme Court Of India: రేప్ కేసు విచార‌ణ‌లో సుప్రీం ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని కించపరచాలనే ఉద్దేశంలో సోయి లేకుండా “చీరా, గాజులు పంపిస్తామంటూ” మాట్లాడే నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంటారు. చీరా, గాజులు.. అసమర్థతకు చిహ్నాలు అనేది వారి మెదళ్లకు పట్టిన బూజు. రాజకీయాల్లో ఇకపై ఇలాంటి మాటలకు స్వస్తి పలకాలని, అది తమ నుండే మొదలవుతుందని లోకేష్‌ చెప్పారు. ఇకపై తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ.. తమ ఇళ్లలో కానీ, బయట కానీ అలాంటి మాటలు ఎక్కడా ఉచ్ఛరించకూడదు అంటూ ఏకంగా శాసనమే చేసేశారు నారా లోకేష్‌.

మహానాడు వేదికపై “స్తీ శక్తి” శాసనాన్ని ప్రతిపాదించబోయే ముందు.. వైసీపీ హయాంలో తనకు చీరా గాజులు పంపిస్తానన్న అప్పటి మహిళా మంత్రి రోజా మాటల్ని గుర్తు చేసుకున్నారు నారా లోకేష్‌. 

“పంపించండి తల్లీ.. వాటిని తన తెలుగుదేశం ఆడపడుచులకు పెట్టి, కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటా..” అంటూ ఆనాడు రోజాకు లోకేష్‌ ఇచ్చిన కౌంటర్‌ తమ్ముళ్లు మర్చిపోరు. ప్రజలు కూడా లోకేష్‌ వ్యక్తిత్వానికి మచ్చు తునకగా ఆ మాటల్ని చూశారు.

ఇక సీఎం చంద్రబాబు.. నేరస్తులు, మహిళలపై దాడులకు పాల్పడే ఉన్మాదులు, సోషల్‌మీడియా సైకోలు, మాఫియాకు మరోసారి మహానాడు వేదికగా హెచ్చరిక చేశారు. సోషల్‌మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే తాట తీస్తానని సీఎం సీబీఎన్‌ పునరుద్ఘాటించారు. అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. తన వద్ద ఎవరి ఆటలూ సాగవని.. నేరస్తులు ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు పంపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *