Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు.. పార్ట్ 2 పై భారీ అంచనాలు?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుండగా, పార్ట్ 1 టైటిల్‌ “స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” అని మేకర్స్ ప్రకటించారు. ఈ టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. పార్ట్ 1 కథలోని ఉత్కంఠ భరితమైన అంశాలు పార్ట్ 2కి బలమైన పునాది వేస్తాయని, ఇది అభిమానులను ఆకట్టుకుంటుందని సమాచారం.ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. యాక్షన్, డ్రామా, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cm revanth: కాంగ్రెస్ పాలనపై చర్చించడానికి సిద్ధం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *