Nadendla manohar: కాకినాడ సీ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా సంబంధిత ఘటన తర్వాత, మరోసారి విశాఖ పోర్టులో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ముఠా బయటపడింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో, 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని విశాఖ పోర్టులో గుర్తించారు. ఈ బియ్యం ఉత్తరాంధ్ర మరియు ఒరిస్సా నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, అధికారులు బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం అక్రమ రవాణాకు సంబంధించిన ముఠా నాయకుడు గురించి విచారణ జరుగుతోంది. విశాఖ పోర్టులో ఇలాంటి అక్రమ చట్రాల గుర్తింపు కోసం నాలుగు బృందాలను రంగంలోకి దింపనున్నట్లు మంత్రి తెలిపారు.