Mumbai Indians victory: ఐపీఎల్‌లో ముంబై ముందుకు దూసుకెళ్లింది. గుజరాత్‌పై గెలిచి టైటిల్ ఆశలు నిలుపుకుంది. ఒకదశలో గుజరాత్ గెలుస్తుందేమో అనిపించినా.. చివర్లో ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను చేజారనివ్వలేదు. ఇక ఆదివారం పంజాబ్‌తో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. 81 రన్స్‌తో ముంబై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డ్స్ సృష్టించాడు.
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 సిక్స్‌లు కొట్టిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్‌లో 300 సిక్స్‌లు పూర్తి చేసిన మొదటి యాక్టివ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 291 సిక్స్‌లతో రెండవ స్థానంలో ఉండగా, ధోని (264) మరియు ఆండ్రీ రస్సెల్ (223) వరుసగా మూడవ మరియు నాల్గవ స్థానంలో ఉన్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత రోహిత్ ఐపీఎల్‌లో 300 సిక్స్‌లు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో, రోహిత్ శర్మ 28 బంతుల్లో తన హాఫ్ సెంచరీని చేరుకున్నాడు మరియు మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఓవరాల్‌గా చూస్తే గేల్ (357) అత్యధిక సిక్సులతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచినా.. అతడు క్రికెట్‌కు గతంలోనే వీడ్కోలు పలికాడు.
Also Read: Gautam Gambhir : గంభీర్ సెలక్ట్ చేయడు.. రిజెక్ట్ చేస్తాడు
Mumbai Indians victory: ఈ మ్యాచులో మరో రికార్డు సైతం రోహిత్ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో 7వేల రన్స్ క్లబ్లో చేరాడు. ఈ ఘనతను సాధించిన రెండో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 271 మ్యాచ్‌ల్లో 7038 పరుగులు చేశాడు. కోహ్లి 266 మ్యాచ్‌ల్లో 8618 మొదటి స్థానంలో ఉన్నాడు. ఇలా తన ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్ రెండు రికార్డులు అందుకున్నాడు.