Mohan Babu: కుటుంబ వివాదాల సుడిగుండంలో నలిగిపోతున్న సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టు రంజిత్‌పై దాడి కేసులో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ ముగిసేంత వరకూ మోహన్‌బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Mohan Babu: గతంలో ఇదే విషయమై మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని గత నెల 23వ తేదీన హైకోర్టు కోట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మోహన్‌బాబుకు వెసులుబాటు కలిగింది. ఇప్పటికే ఆయన తాను చేసిన దాడి విషయంలో పశ్చాతాపంతో ఉన్నారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును పరామర్శించారు.
Mohan Babu: జర్నలిస్టు రంజిత్ కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. అదే విధంగా జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణలు కోరారు. అదే విధంగా రంజిత్ చికిత్సలకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఒప్పుకున్నారు. ఇటీవలే గతం గతః అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ జర్నలిస్టులతో స్నేహభావాన్ని కోరుకుంటున్నట్టు ప్రకటించారు.