Raj Gopal Reddy

Raj Gopal Reddy: డీకే శివకుమార్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ

Raj Gopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి సమావేశమయ్యారు. ఈ భేటీ ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. అయితే, ఈ సమావేశం కేవలం స్నేహపూర్వకంగానే జరిగినదా? లేదా రాజకీయ లక్ష్యాలతోనా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

మంత్రి పదవి హామీపై కోమటిరెడ్డి అసంతృప్తి

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినప్పుడు హైకమాండ్ తనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని కోమటిరెడ్డి ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్‌ కు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, హైకమాండ్‌కి చెప్పాలన్న బాధ్యతను ఆయన భుజాలపై వేసినట్టు సమాచారం.

రేవంత్ రెడ్డి పై వరుస విమర్శలు

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి పదే పదే విమర్శలు చేస్తున్నారు. “తాను పదేళ్లు సీఎం‌గా ఉంటానని రేవంత్ చెప్పడం కాంగ్రెస్ విధానమేనా?” అంటూ ప్రశ్నించారు. అలాగే, సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై కూడా కౌంటర్ ఇచ్చారు. “వారిని బెదిరించడం బదులు, ప్రభుత్వంగా మీరు చేస్తున్న పనులు చెప్పండి” అంటూ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Sachin: సిరాజ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టెండూల్కర్

ఇక “తెలంగాణను ఆంధ్రా కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు” అనే ఆరోపణలు కూడా ఆయన చేసిన విషయం తెలిసిందే. పార్టీ లో తనకంటే తర్వాత వచ్చినవారికి పదవులు రావడం, తానేమీ లేనట్టుగా మిగిలిపోవడం పట్ల కోమటిరెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

డీకే శివకుమార్ పాత్రపై చర్చ

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డీకే శివకుమార్ రాజకీయంగా ప్రభావం చూపుతున్నట్టు చెప్పుకోవచ్చు. సీఎం ఎంపికలోనూ, రేవంత్ రెడ్డిని ప్రోత్సహించడంలోనూ డీకే పాత్ర ఉందని ప్రచారం ఉంది. అంతేకాకుండా, డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్‌కి అత్యంత సన్నిహితుడు. గతంలో వైఎస్ షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన చర్చలకూ ఆయనే కీలకంగా వ్యవహరించారు.

భవిష్యత్తులో రాజకీయ మార్పులకు బీజం?

కోమటిరెడ్డి – డీకే శివకుమార్ సమావేశం అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి, తన భవిష్యత్తు దిశలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *