Ponnam Prabhakar: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది! ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన మంత్రి పొన్నం.. గత బీఆర్ఎస్ పాలనలోని వివాదాలు, అవినీతి ఆరోపణలను ఏకరవు పెడుతూ కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. మీ అవినీతి లెక్కలు చెప్పడానికి ఏకంగా ఏడాది సమయం పడుతుంది” అంటూ పొన్నం చేసిన పోస్ట్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రాహుల్ గాంధీపై విమర్శలు – పొన్నం ఘాటు సమాధానం..
గత బీఆర్ఎస్ పాలనలోని ఘటనలను గుర్తుచేస్తూ ప్రశ్నల వర్షం..
-
నేరెళ్ల, ఖమ్మం, మల్లన్నసాగర్ ఘటనలు: “నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి మీ హయాంలో జరగలేదా? ఖమ్మంలో మిర్చి రైతులకు చేతులకు బేడీలు వేసింది మీ ప్రభుత్వమే కాదా? మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేయించింది మీ పాలనలో కాదా?” అని ప్రశ్నించారు.
-
గ్రూప్-1 నోటిఫికేషన్: “పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల కోసం కనీసం ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా సరిగ్గా ఇచ్చారా? మేము అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించి చూపించాం” అని పొన్నం కౌంటర్ ఇచ్చారు.
ఫార్ములా-ఈ రేస్, కాళేశ్వరం అవినీతి ఆరోపణల ప్రస్తావన..
రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్ కి లేదు
ఆ కుటుంబ మొత్తం త్యాగం చేసిన కుటుంబం ..
నేరెళ్ల దళితుల దాడి మీ సారధ్యం కాదా ?
ఖమ్మంలో రైతులకు బేడీలు మీ పాలనలో కాదా?
మల్లన్న సాగర్ బాధితుల మీద లాఠీ ఛార్జి మీ పాలన కదా ?పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారా?
మేము ఇచ్చాము.. నిర్వహించి చూపించాము..
మాకు హామీలు ఇవ్వడమే కాదు అమలు చేసే సత్తా కూడా ఉంది ..
మీలాగ వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదన మీద ఆసక్తి లేదు .. అవసరం లేదు .. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాము
అవినీతి గురించి మీరు మాట్లాడటం అంటే వింతగా ఉంది .. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని మీరు ..
కాళేశ్వరం , విద్యుత్ కొనుగోలు.. అసైన్ ల్యాండ్ లు .. ఇలా చెప్పుకుంటూ పోతే.. మీ అవినీతిలెక్కలు చెప్పడానికి ఒక ఏడాది పడుతుంది ..
మీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్భాటాలు .. మా ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న ఏర్పాట్లు. బేరీజు వేస్తే అబద్ధం కూడా సిగ్గు పడుతుంది ..
@KTRBRS @BRSparty @INCTelangana @INCIndia
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 13, 2026
