Nara Lokesh: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు దక్కాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారం, పాలనలో అలసత్వాన్ని వీడటంపై దిశానిర్దేశం చేశారు. వచ్చే అక్టోబర్ నెల నుంచే దశలవారీగా కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తామని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని సహచర మంత్రులను కోరారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు – వాయిదా ప్రసక్తే లేదు..
అధికారుల తీరుపై సీరియస్ – సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జాగ్రత్త..
ప్రత్యేక కార్యక్రమం & నీటి పొదుపు చర్యలు..
పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్ట్ చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా (సెప్టెంబరు 9న) ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తున్నారో ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, తాగు, సాగునీటి అవసరాల కోసం ముందస్తు పొదుపు చర్యలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
