Maoist Leader Hidma Encounter:మావోయిస్టు అగ్రనేత, ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అయిన మద్వి హిడ్మా (43) పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఆ రాష్ట్ర పోలీసుల చేతిలో హిడ్మా మరణించారు. అయితే హిడ్మా మరణంపై ఓ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజంగా ఆయన్ను ఎన్‌కౌంటర్‌లో చంపారా? లేక లొంగిపోయేందుకు వస్తున్న ఆయన్ను దారికాచి చంపారా? ఇదే సమయంలో హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్ అని పౌరహక్కుల సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
Maoist Leader Hidma Encounter:వాస్తవంగా 2026 మార్చిలోగా భారతదేశంలో మావోయిస్టులు అనేవాళ్లు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ గెరిల్లా టాప్ కమాండర్ మద్వి హిడ్మాను హతమార్చేందుకూ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టిందని సమాచారం. 2025 నవంబర్ 30లోపు హిడ్మాను అరెస్టు చేయాలని, లేదా ఎన్‌కౌంటర్ అయినా చేసి మట్టుబెట్టాలని కేందం భద్రతా బలగాలను ఆదేశించినట్టు సమాచారం.
Maoist Leader Hidma Encounter:ఈ దశలోనే భద్రతా బలగాల కూంబింగ్ తీవ్రతరం కావడంతో హిడ్మాలో కూడా గుబులు మొదలైందని అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ పోలీసుల్లో ఎవరికి చిక్కినా తనను ఎన్‌కౌంటర్ చేస్తారని భావించాడని అంటున్నారు. ఇదే సమయంలో లొంగిపోవడంతో సరైన నిర్ణయమని హిడ్మా భావించినట్టు తెలుస్తున్నది.
Maoist Leader Hidma Encounter:ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం తనకు తెలసిన ఓ జర్నలిస్టుకు హిడ్మా ఓ లేఖను రాసినట్టు సమాచారం. ఆ లేఖలో కీలక విషయం వెలుగు చూసిందని అంటున్నారు. తాను లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్టు ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారని తెలిసింది. భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమని, ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ లేఖలో తెలిపారు. ఆయుధాలు వీడే ముందు పలు అంశాలపై తాను చర్చించాలని పేర్కొన్నారు.
Maoist Leader Hidma Encounter:ఏపీ పోలీసుల ఎదుటే లొంగిపోవాలని హిడ్మా నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ మేరకే ఏపీ బార్డర్‌లోకి వచ్చాడని తెలుస్తున్నది. ఏపీ మీదుగా తమిళనాడు వెళ్లి అక్కడ తలదాచుకోవాలని భావించాడని అంటున్నారు. అక్కడి నుంచి కీలక చర్చల అనంతరం ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోవాలని భావించినట్టు సమాచారం. అయితే ఇంతలోనే హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.
