Chhattisgarh

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత: బీజాపూర్‌లో మావోయిస్టు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), ఎస్‌టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు దీటుగా స్పందించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Also Read: KTR: రైతు సంక్షేమంపై చ‌ర్చిద్దాం రండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ స‌వాల్‌

Chhattisgarh: ఈ ఎన్‌కౌంటర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’లో భాగం. వర్షాకాలంలో కూడా మావోయిస్టుల ఏరివేతను ఆపకూడదని అమిత్ షా ఇటీవల నిజామాబాద్‌లో ప్రకటించిన నేపథ్యంలో, ఇంద్రావతి నదికి వరదలు ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగడం గమనార్హం. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా బలగాలు పనిచేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Encounter: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 31 మంది మావోలు హ‌తం.. ఇద్ద‌రు జ‌వాన్ల‌ మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *