Manchu manoj: మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో తమకంటూ ఎప్పుడు రేంజ్ ఉండేటట్టు చూసుకుంటుంది తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్ తర్వాత మంచు మనోజ్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఇది టాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతోంది. “కన్నప్పలో రెబెల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అంటూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత తన తండ్రి మోహన్ బాబు నటించిన ఓ సినిమాలోని ఓ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు. ‘బలవంతంగా తన్ని, కొట్టి, చంపుతానని బెదిరించి నేను తెచ్చి ఇచ్చిన దస్తావేజులు నాకు కావాలి సామి… నా ఆలి చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చాను’ అంటూ మోహన్ బాబు నటించిన సినిమా వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.
