Manchu manoj: తిరుపతిలోని చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ నటుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదులో ఆయన మోహన్‌బాబు యూనివర్సిటీ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్‌లపై ఆరోపణలు చేశారు.మంచు మనోజ్ తన ఫిర్యాదులో కొన్ని ముఖ్యాంశాలను ప్రస్తావించారు.”మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు చాలా బాధాకరం” అని మంచు మనోజ్ పేర్కొన్నారు. “గొడవలు సృష్టించడం నా ఉద్దేశం కాదు. నా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన బ్యానర్లను సిబ్బంది తీసేయడం, ఫ్యాన్స్‌ను బెదిరించడం వల్లే ఈ వివాదం ప్రారంభమైంది,” అని తెలిపారు.
“చంద్రబాబు నాయుడు లేదా లోకేష్‌తో మా కుటుంబ అంశాలను చర్చించలేదు. నాకు సాయం చేయాలని ఎవ్వరినీ అడగలేదు” అని స్పష్టం చేశారు. మంచు మనోజ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా, చంద్రగిరి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. “ఇది నా వ్యక్తిగత సమస్య, దీన్ని నేను సమర్థవంతంగా పరిష్కరించుకుంటాను” అని మంచు మనోజ్ తెలిపారు.