Delhi: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపు కారణంగా తమకు నష్టం కలుగుతోందని పేర్కొంటూ, వీరిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.
రిట్ పిటిషన్:
ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్,గాంధీ పేర్లు ఉన్నాయి.
ఎస్‌ఎల్పీ పిటిషన్:
దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి,ఈ ముగ్గురిపై ప్రత్యేక అనర్హత చర్యలు కోరుతూ ప్రత్యేక లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు.మాజీ మంత్రి హరీష్‌రావు ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చల కోసం ఢిల్లీలో ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగానికి విరుద్ధమని, ప్రజా నైతికతకు చెడ్డపేరు తీసుకురాగలవని కోర్టుకు వివరించింది.