Manchu Family Controversy

Manchu Family Controversy: నా తండ్రి చాలా గొప్పవారు.. అందుకు సారీ : మంచు మనోజ్

Manchu Family Controversy: మంచు ఫ్యామిలీ మంటలు పెద్దవి అయ్యాయి. మొన్నటి వరకూ ఇది కుటుంబ వ్యవహారం అంటూ కప్పిపెట్టే ప్రయత్నం చేసినా . . తరువాత జరిగిన సంఘటనలు దీనిని వీధిలోకి వచ్చిన కుటుంబ కథా చిత్రమ్ గా మార్చేశాయి. తప్పెవరిది . . ఒప్పెవరది వంటి విషయాలను పక్కన పెడితే, తాజాగా జరిగిన సంఘటనలు మాత్రం మంచు ఫ్యామిలీలో భగ్గుమన్న విబేధాల స్థాయిని ప్రజల ముందుకు తీసుకువచ్చేశాయి. మోహన్ బాబుపై మంచు మనోజ్ కేసు పెట్టడం . . మోహన్ బాబు కూడా మనోజ్ పై కేసు పెట్టడంతో రచ్చ మొదలైంది. తరువాత మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లడం . . బౌన్సర్లు గేటు మూసి అడ్డుకోవడంతో గేటు బద్దలుకొట్టుకుని లోపలి వెళ్లడం ఆ తరువాత మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం . . దాని విషయంలో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం వరుసగా జరిగిపోయాయి.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో రిజర్వేషన్ నిరసనలు హింసాత్మకం

Manchu Family Controversy: ఈ నేపధ్యంలో మంచు మనోజ్ జరిగిన సంఘటనలపై స్పందించారు. మీడియాపై జరిగిన దాడిపై క్షమాపణలు చెప్పారు .  అలా జరిగి ఉండకూడదని అన్న మనోజ్ మీడియాపైనా దాడిని ఖండించారు. ఇక తన తండ్రి చాలా మంచివారంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆయనంటే గౌరవం ఉందని చెప్పిన మనోజ్.. తన అన్న ,  వినయ్ ఇద్దరూ కలిసి తనకు . . తన తండ్రికి మధ్య అగాధం సృష్టించారని చెప్పారు. వారిద్దరూ చేస్తున్న అక్రమాలను నిలదీస్తున్నందునే తన తండ్రిని తప్పుదారి పట్టించి తనపై ఆగ్రహం పెరిగేలా చేశారంటూ చెప్పుకొచ్చారు .

ఈ విషయంలో మరిన్ని వివరాలు సాయంత్రం ప్రెస్ మీట్ లో వివరిస్తామని ఆయన చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gutka: ఆ రాష్ట్రం లో గుట్కా పాన్ మసాలా.. ఏడాది పాటు బంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *