Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకునే పరమ పవిత్రమైన అలిపిరి నడక మార్గంలో అపచారం చోటుచేసుకుంది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, కాలిబాటలో పాదరక్షలు లేకుండా నడుస్తూ గోవింద నామస్మరణతో కొండపైకి వెళ్తుంటారు. అలాంటి పరమ పావనమైన మెట్ల మార్గంలో ఒక వ్యక్తి యథేచ్ఛగా బూట్లు (షూ) ధరించి మెట్లు ఎక్కుతూ కనిపించడం స్థానికంగా పెను దుమారం రేపింది.
భక్తుల తీవ్ర ఆగ్రహం – నిఘా వైఫల్యంపై మండిపాటు:
అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో మరియు దారిపొడవునా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు. అయినప్పటికీ సదరు వ్యక్తి బూట్లతో మెట్లు ఎక్కుతుంటే సిబ్బంది ఎందుకు గమనించలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నడక దారుల్లో భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసి, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
బూట్లతో అలిపిరి మెట్లు ఎక్కుతున్న వ్యక్తి
శ్రీవారి సన్నిధికి చేరుకునే పరమ పవిత్రమైన మెట్ల మార్గంలో షూ వేసుకొని నడక
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు pic.twitter.com/wwRnepVvpi
— Telugu Feed (@Telugufeedsite) September 19, 2026
