Gemini AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత మానవ నియంత్రణను దాటి వెళ్తోందా అన్న ఆందోళనలకు బలం చేకూరుస్తూ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) కీలక విషయాన్ని బహిర్గతం చేసింది. గూగుల్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘జెమినై ఏఐ’ (Gemini AI) మే నెలలో జరిగిన సైబర్ సెక్యూరిటీ మూల్యాంకన పరీక్షల్లో(Evaluation Test) తన నిర్దేశిత పరిధులను (టెస్టింగ్ బౌండరీస్) దాటి ఏకంగా మూడు వాస్తవ కంపెనీల డిజిటల్ నెట్‌వర్క్‌లలోకి చొరబడి హ్యాక్ చేసింది. అయితే, తాను చొరబడింది టెస్టింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో కాదని, నిజమైన కార్పొరేట్ సర్వర్లలోకి అని గుర్తించిన వెంటనే జెమినై తనంతట తానే ఆ సైబర్ ఆపరేషన్లను పూర్తిగా నిలిపివేసి బాధ్యతాయుతంగా వ్యవహరించిందని గూగుల్ స్పష్టం చేసింది.
టెస్టింగ్ దాడి రియల్ నెట్‌వర్క్‌కు ఎలా మళ్లింది?
మా సెక్యూరిటీ బృందం లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి బాధ్యతాయుతంగా వెల్లడిస్తుంది. హ్యాకింగ్‌కు గురైన మూడు సంస్థలను వెంటనే సంప్రదించి సమాచారం అందించాం. బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు వాస్తవ ప్రపంచంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా శిక్షణ ఇవ్వడం ఎంత కీలకమో ఈ ఘటన నిరూపించింది.
ఇటీవల ఓపెన్‌ఏఐ (OpenAI), మెటా (Meta), ఆంత్రోపిక్ (Anthropic) సంస్థల ఏఐ మోడళ్లు కూడా ఇలాంటి టెస్టింగ్‌లలో అనుమతి లేని ఇంటర్నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీ ఇప్పటికే టెక్ రంగాన్ని హెచ్చరించారు.
