Viral Video: పూణే-హతియా ఎక్స్‌ప్రెస్ రైలులో అర్ధరాత్రి సమయంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ప్రయాణికుడిపై మరో ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో బాధితుడు ప్రతిఘటించడంతో రైలులో కొంతసేపు గందరగోళం నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, పూణే-హతియా ఎక్స్‌ప్రెస్‌లో నిర్మల్ మిశ్రా అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో, పక్కనే నిద్రిస్తున్న మిశ్రాను ఓ వ్యక్తి లేచి ముద్దులు పెట్టాడు. అంతేకాకుండా, అతని ప్రైవేట్ పార్ట్‌ను కూడా తాకాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మిశ్రా, వెంటనే అతడిని ప్రతిఘటించాడు.
ఆ వ్యక్తి ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన మిశ్రా, అతడిని గట్టిగా నిలదీశాడు. అనంతరం, మిశ్రా అతడిని కొట్టడంతో రైలులో కొంతసేపు గందరగోళం నెలకొంది. తోటి ప్రయాణికులు కల్పించుకుని ఇద్దరినీ శాంతింపజేశారు.
Also Read: Baba Vanga Facts: బాబా వంగా అంధత్వానికి కారణం ఏంటో తెలుసా
ఈ ఘటన గురించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి స్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.