Viral News: నేటి పోటీ ప్రపంచంలో చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించడం కత్తిమీద సాములా మారింది. ఎన్నో ఇంటర్వ్యూలు, నెలల తరబడి నిరీక్షణ తర్వాత జాబ్ దక్కితే ఆ ఆనందమే వేరు. కానీ, న్యూయార్క్‌కు చెందిన ఓ యువకుడికి తొమ్మిది నెలల కష్టాల తర్వాత ఉద్యోగం లభించినా, ఆ సంతోషం కేవలం రెండున్నర గంటలు మాత్రమే నిలిచింది. విధుల్లో చేరిన మొదటి రోజే, అదీ కేవలం 2.5 గంటల్లోనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
కొత్త ఉత్సాహంతో మొదటి రోజు ఆఫీస్‌కు..
ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. “కార్పొరేట్ కంపెనీల కొన్ని వింత నిర్ణయాలు ఎప్పటికీ అర్థం కావు” అని కొందరు వ్యాఖ్యానించగా.. “అసలు కారణం వేరే ఉండి ఉంటుంది, మీకు చెప్పకుండా హైజీన్ అని సాకు చెప్పి ఉంటారు” అని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. ధైర్యం కోల్పోవద్దని, మంచి కంపెనీలో మరో ఉద్యోగం లభిస్తుందని పలువురు నెటిజన్లు అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
I was let go from my new job after 2.5hrs.
by
u/Havocko in
BoyDinnerDiaries
