Malaika Arora: బాలీవుడ్ సెలెబ్రిటీస్‌లో కొంతమందిని మనం చూస్తే, ఐదు పదుల వయసు దాటినా స్లిమ్‌గా ఉంటూనే, ఫ్లెక్సిబుల్‌గా ఉంటూ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. 51 ఏళ్ల వయసులో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్న ముద్దుగుమ్మ మలైకా అరోరా తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు చూస్తే ‘ఇంత సాధారణ విషయాలు పాటిస్తే చాలా?’ అనిపిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి రోజు ఉదయం 6 గంటలకే నిద్ర లేచి వెంటనే వర్కవుట్ చేస్తారట. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు రొటీన్‌లో భాగం చేసుకుంది. ‘యోగా నాకు ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది, ఒత్తిడి తగ్గించింది, ఇన్నర్ పీస్ ఇచ్చింది’ అని చెబుతోంది. షుగర్-జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం, మైండ్‌ఫుల్‌గా తినడం అంటోంది మలైకా.
ఇది కూడా చదవండి: Akhanda 2 Balakrishna: శివుడి తాండవం చూస్తారు.. సినిమాపై హైప్ పెంచేసిన బాలకృష్ణ
30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆమెకి ఫిట్‌నెస్ చేయడం, డైట్ పాటించడం, కేలరీలు లెక్కపెట్టుకొని తినడం, ఇవన్నీ నచ్చకపోయినా చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఎప్పుడైతే 40లలోకి అడుగుపెట్టానో అప్పుడే వాటివల్ల కలిగే ప్రయోజనాలు అర్థమైంది. వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు మొదలు అవుతాయి. హార్మోన్ల మార్పులు, మెటబాలిజం స్లో అవ్వడం సహజం అన్నారు. ఆ మార్పులని అర్థం చేసుకుంటూ మనం వాటికి తగ్గట్టుగా లైఫ్‌స్టైల్‌ని మార్చుకోవాలి అన్నారు.
ఇంతకుముందు కేలరీలు లెక్కపెట్టుకొని తినేదాన్ని, కానీ ఇప్పుడు నా ఫుడ్ నేనే వండుకొని తినడం మొదలుపెట్టాను. దీనివల్ల నేను తినే ఫుడ్‌తో కనెక్ట్ అవగలుగుతున్నాను. ప్లేట్‌లో రంగురంగుల కూరగాయలు, గింజలు, లీన్ ప్రోటీన్‌లతో బ్యాలెన్స్‌డ్ మీల్స్ తయారు చేసుకుని మైండ్‌ఫుల్‌గా తినగలుగుతున్నాను. ఇంకా వయసు పెరిగేకొద్దీ శరీరం కంటే మనసు, భావోద్వేగాలు కూడా ఆరోగ్యంలో భాగమేనని ఆమె తెలుసుకుంది. అందుకే యోగా స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు నా రొటీన్‌లో భాగం చేసుకున్నాను. ‘యోగా నాకు ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది, ఒత్తిడి తగ్గించింది, ఇన్నర్ పీస్ ఇచ్చింది’ అంటోంది మలైకా. అయినా యోగా, మైండ్‌ఫుల్ ఈటింగ్‌తో శరీరాన్ని రీసెట్ చేయవచ్చు అనే విషయాన్ని మలైకా రుజువు చేసింది. వయసు కేవలం సంఖ్య మాత్రమే, లైఫ్‌స్టైల్ మారితే గ్లో మారుతుంది!
