Hyderabad: హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.దినేశ్ గోస్వామి, మోనా ఠాగూర్ దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం దినేశ్ పుట్టిన రోజు కవాడంతో.. భార్యతో కలిసి లంగర్‌హౌజ్‌లోని అత్తగారింటికి వెళ్లాడు. వేడుకలు ముగించుకుని టూవీలర్‌పై నందినగర్‌కు తిరుగు పయణమయ్యారు.
ఈక్రమంలో ఎదురుగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఆటో, మరో బైక్‌ను కూడా గుద్దింది. ఈ ప్రమాదంలో మోనా, దినేశ్ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు దవాఖానకు తరలించారు.
మృతురాలు మోనా ఠాగూర్ ప్రస్తుతం గర్భవతి. కారు డ్రైవర్ పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.