Maharashtra Election

Maharashtra Election: ఈవీఎంలలో ఎటువంటి పొరపాటు లేదు:ఎన్నికల సంఘం

Maharashtra Election: ఎన్నికల తీర్పును మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ఇంకా అంగీకరించడం లేదు. ఎన్నికల ఫలితాల్లో ఈవీఎంలు, భారత ఎన్నికల సంఘం పాత్రపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా VVPAT స్లిప్‌లు, EVM గణాంకాలను లెక్కించినప్పుడు, ఎటువంటి వ్యత్యాసం కనిపించలేదని మహారాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

“భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ర్యాండమ్ గా ఎంపిక చేసిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల VVPAT స్లిప్‌లను లెక్కించడం తప్పనిసరి” అని మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. దీని ప్రకారం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 పోలింగ్ బూత్‌ల వీవీపీఏటీ స్లిప్‌ల లెక్కింపు నవంబర్ 23న జరిగింది. కౌంటింగ్ పరిశీలకులు లేదా అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. . దీని ప్రకారం, తేడా కొంచెం కూడా  కనబడలేదు. ఎన్నికల సంఘం సరైన నిబంధనలను పాటించిందని మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Mohan Babu: మోహన్‌బాబు హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Maharashtra Election: ఈ ఏడాది ఏప్రిల్‌లో, వీవీప్యాట్‌తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ఉపయోగించి పోలైన ఓట్లను పూర్తి క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. VVPAT అనేది ఓట్ వెరిఫికేషన్ మెకానిజం, ఇది EVM బటన్‌ను నొక్కిన తర్వాత క్లుప్తంగా కనిపించే స్లిప్ ద్వారా ఓటర్లు తమ ఓట్లు సరిగ్గా నమోదు అయ్యాయో లేదో చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *