vikram

Vikram: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘వీర ధీర శూరన్’ టీజర్

Vikram: ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్-2’. భారీ అంచనాల నడుమ ఈ సినిమాను ఎస్.యు. అరుణ్ కుమార్ రూపొందించారు. రియా శిబు నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో కిరాణా కొట్టు నడిపే వ్యక్తిగానూ, అదే సమయంలో శత్రుమూకలను చెదరగొట్టే విధ్వంసకుడిగానూ విక్రమ్ నటించారు. అలానే పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎస్.జె. సూర్య చేశారు. ఈ టీజర్ లో వీరిద్దరితో పాటు సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ కూడా ఉన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే జనవరిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీనిని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijay Sethupathi: అరవింద్ స్వామిని బయటకు పంపమన్న విజయ్ సేతుపతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *