Maharashtra

Maharashtra: చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగం.. తిరిగేది బీడబ్ల్యూఎం కారులో.. అలా ఎలా?

Maharashtra: తేలికగా డబ్బు దొరికితే ఎన్ని వేషాలు అయినా వేస్తారు. కాంటాక్ట్ ఉద్యోగం వెలగబెట్టే వ్యక్తి బీడబ్ల్యుఎం కారు కొన్నాడంటే ఎంత అవినీతి చేశాడో అర్ధం అవుతుంది. మహారాష్ట్రలో ఓ ప్రబుద్ధుడు కోట్లాదిరూపాయల కుంభకోణం చేసి ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. వివరాల్లోకి వెళితే 

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.21 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ మొత్తంతో ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ప్రియురాలికి బహుమతిగా ఇచ్చాడు. తన కోసం బీఎండబ్ల్యూ కారు, బైక్‌ కొన్నాడు.

23 ఏళ్ల హర్షల్ కుమార్ క్షీరసాగర్ శంభాజీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని జీతం 13 వేల రూపాయలు. ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 7వ తేదీ మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా శాఖలోని 13 ఖాతాలకు రూ.21 కోట్ల 59 లక్షల 38 వేలు బదిలీ చేశాడు. తోటి ఉద్యోగి యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్‌తో కలిసి అతడు ఈ మోసానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: TamilNadu: చెన్నైలో ఇంటర్ విద్యార్థిపై అత్యాచారం.. స్టాలిన్ పై బీజేపీ ఆరోపణలు

Maharashtra: బ్యాంకు ఖాతా నుంచి రూ.59 కోట్లు దుర్వినియోగం అయినట్టు అధికారులు గుర్తించారు. శంభాజీనగర్‌లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పంపింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఇండియన్ బ్యాంకులో ఖాతా తెరిచారు. డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం చేసిన చెక్కుల ద్వారా ఈ ఖాతాలో లావాదేవీలు జరిగాయి. నిందితులు హర్షల్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ నకిలీ పత్రాలు తయారు చేసి బ్యాంకుకు ఇచ్చి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని వారి ఖాతాకు బదిలీ చేసుకున్నారు.  ఈ ఘటన 6 నెలల తర్వాత డిప్యూటీ డైరెక్టర్‌కు తెలిసింది. హర్షల్ పరారీలో ఉండగా, యశోద, ఆమె భర్తను అరెస్టు చేశారు

స్కాం వెలుగులోకి రావడంతో నిందితుల ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. నిందితుడు హర్షల్ రూ.1.20 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు, రూ.1.30 కోట్ల విలువైన ఎస్‌యూవీ, రూ.32 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఇది కాకుండా, అతను తన స్నేహితురాలి కోసం విమానాశ్రయం ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో 4 BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. నిందితులు నగరంలోని ప్రముఖ నగల వ్యాపారికి డైమండ్ కళ్లద్దాలు తయారు చేయమని ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆమె తోటి కాంట్రాక్టు ఉద్యోగి భర్త కూడా రూ.35 లక్షల విలువైన ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశారు.

ALSO READ  Siddipet: హిట్ అండ్ రన్.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ స్పాట్

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *