Mahaa Bhakthi: న్యూస్ , ఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతున్న మహా గ్రూప్ మరో కొత్త ఛానల్ తో ప్రేక్షకులకు దగ్గర కావడానికి సిద్ధం అవుతోంది . ఇప్పటికే మహా న్యూస్ ఛానెల్, మహా మాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మహా గ్రూప్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల కు సమాచార-వినోద కార్యక్రమాలను అందిస్తున్నాయి . ఈ రెండు ఛానల్స్ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాయి. ఒక పక్క వార్తా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరవేస్తున్న మహా న్యూస్ మరోపక్క ప్రజల సమస్యలు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కథనాలను అందిస్తూ వస్తోంది. మహా న్యూస్ కథనాలతో రైస్ మాఫియా లాంటి దోపిడీపై పెద్ద యుద్ధమే సాగింది . అలాగే , మరోపక్క మహా మాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారా సినిమా సంగతులను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తూ వస్తోంది . ఆనాటి సినిమా కథలు . . ఈనాటి మూవీ పోకడలు . . వెండి తెర వెనుక సంగతులు . . ఇలా వినోద ప్రపంచంలో ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ . . ఆదరాభిమానాలను చూరగొంటోంది.
Mahaa Bhakthi: ఈ నేపథ్యంలో మహా గ్రూప్ నుంచి ప్రత్యేకంగా భక్తి ఛానల్ రాబోతోంది. పండుగలు . . పర్వదినాలు . . మన సంస్కృతీ సంప్రదాయాలు . . సనాతన ధర్మ పరిరక్షణ . . అన్నిటినీ కలబోసి తెలుగు ప్రజల కోసం నిరంతర భక్తి స్రవంతిని అందించడానికి మహా గ్రూప్ నడుం బిగించింది. మహా గ్రూప్ భక్తి పూర్వకంగా తెలుగు ప్రేక్షకులకు సమర్పించబోతున్న మహా భక్తి ఛానల్ దేవదేవుని ఆశీస్సులతో.. మహా శివరాత్రి పర్వదినం రోజున ప్రారంభించడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న జరిగే మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు మహా గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీకృష్ణ. ఈ సందర్భంగా మహా గ్రూప్ నుంచి వస్తున్న మహా భక్తి ఛానల్ గురించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు మారెళ్ల వంశీకృష్ణ .
Mahaa Bhakthi: మహా గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీకృష్ణ ఆహ్వానానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. మహా గ్రూప్ తీసుకువస్తున్న భక్తి ఛానల్ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
