Mahaa Vamsi Comments: జగన్ మోహన్ రెడ్డికి రెండు కోర్కెలు.. మొదటి నుంచి ఉన్న కోరిక ముఖ్యమంత్రి కావాలని. అందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఎంతగా ప్రజల్ని మభ్యపెట్టాలో అంతగానూ మభ్యపెట్టారు. ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఆయన కాంగ్రెస్ కు ఎదురుతిరిగారు. సొంత పార్టీ పెట్టారు. ఈ క్రమంలో ఆయన అవినీతి కేసులతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్లిన సమయంలో ఆయనకు మరో కోరిక పుట్టింది. అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జైలుకు పంపించాలని. దాని కోసం జైలు నుంచి విడుదలైన దగ్గర నుంచి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. లేని మకిలిని పులుముతూ వచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రెండే పనులుగా పెట్టుకున్నారు. ఒకటి ప్రజలకు డబ్బులు పంచేయడం. రెండు చంద్రబాబును జైలుకు పంపించే అవకాశాలు వెతకడం. డబ్బు పంచడం చాలా ఈజీ. డబ్బు పంచితే ప్రజలు తన మాటే శాసనంగా పడి ఉంటారనే ఆలోచన అది. అందుకే దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగారు.
Mahaa Vamsi Comments: కానీ, చంద్రబాబును ఇరికించడం అనేది ఆయన వల్ల కాలేదు. దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించినప్పటికీ చంద్రబాబును ఫ్రేమ్ చేసే ఒక్క అవకాశమూ దొరకలేదు. దీంతో తానేం చెబితే అది చేసే అధికారులను పట్టుకుని.. వారికి విశేషమైన అధికారాలిచ్చి.. చంద్రబాబును జైలుకు పంపడమే పనిగా వారికి టార్గెట్ ఇచ్చారు. మొత్తమ్మీద లేని స్కిల్ కేసును.. చంద్రబాబు మెడకు చుట్టి.. అర్ధరాత్రి అరెస్ట్ చేయించి.. ప్రతి సాక్షిని బెదిరించి.. సాక్ష్యాలు తారుమారు చేయించి ఆయనను 53రోజుల పాటు జైలులో ఉంచగలిగారు.
Mahaa Vamsi Comments: ఇక్కడితో జగన్మోహన్ రెడ్డి కోర్కెలు తీరిపోయాయి. కానీ, ఆయనలోని పైశాచికత్వం మాత్రం ఆగలేదు. 53 రోజుల పాటు జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఏవిధంగా గడుపుతున్నారో ప్రతి నిమిషం తన తాడేపల్లి ప్యాలెస్ లో కూచుని లైవ్ లో చూశారని మహాన్యూస్ కు అందిన విశ్వసనీయ సమాచారం. ఇది నిజం. రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడుకు రక్షణ పేరుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి.. వాటికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అంటే ఐపీ ఎడ్రస్.. పాస్ వర్డ్స్ తాడేపల్లి ప్యాలెస్ లో ఒక వ్యక్తికీ అందించి దానిద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు జైలులో ఎలా గడుపుతున్నారనే విషయాల్ని లైవ్ లో చూస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చారని తెలుస్తోంది.
Mahaa Vamsi Comments: చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 10వ తేదీన రాజమండ్రి జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లారు. ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లండన్ లో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలులోపలికి వెళ్లిన దృశ్యాలు వీడియోలు తీసి లండన్ చేరవేశారు కొందరు. నిజానికి జైలు లోపల వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. కానీ, ఆ వీడియోలు తీయడమే కాకుండా బయటకు కూడా వచ్చాయి.
Mahaa Vamsi Comments: ఇంకా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు జైలులో ఉన్న 53రోజుల్లోనూ ప్రతి ఆదివారం తాడేపల్లి ప్యాలెస్ లో రివ్యూ జరిగేదని తెలిసింది. నలుగురు పోలీసు అధికారులు, ఒక పొలిటీషియన్ అక్కడ ఆ వారం అంతా చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన దృశ్యాలు.. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వీడియోలు అన్నీ చూస్తూ సంబర పడేవారని విశ్వసనీయంగా అందిన సమాచారం. పవన్ కళ్యాణ్ జైలులో చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన మాటలను లీక్ చేయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయనే విషయం ఇప్పుడు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే, జగన్మోహన్ రెడ్డి.. ఆయన అనుచరులు చంద్రబాబు నాయుడును జైలుకు పంపి.. ఆయన పడే కష్టాన్ని చూసి మానసికానందాన్ని పొందారనేది మహాన్యూస్ కు అందిన విశ్వసనీయమైన సమాచారం.
ఈ సమాచారం ఆధారంగా ఇప్పుడు మహాన్యూస్ ప్రేక్షకుల తరఫున, ప్రజల తరుఫున ఈ అంశాలపై సీఐడీ విచారణ లేదా SIT విచారణ జరిపించి నిజాలు నిగ్గుతీయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి అంశంపై విచారణ జరపాలని కోరుతున్నాం.
ఈ కథనాలు కూడా చదవండి :
Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Nayanthara: నయనానంద నాయిక.. నయనతార