SEBI Chief: అవినీతి ఆరోపణలపై విచారణకు జనవరి 28, 2025న హాజరు కావాలని ఢిల్లీ లోక్‌పాల్ మాధవి పూరీ బుచ్‌ను ఆదేశించింది. అదానీ గ్రూపునకు చెందిన అక్రమ పెట్టుబడి కంపెనీల్లో సెబీ, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ చైర్మన్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ పెట్టుబడులు పెట్టారని హిండర్‌బర్గ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల ఆరోపించింది. అయితే అవన్నీ నిరాధార ఆరోపణలని మాధవి కొట్టిపారేసింది.
అంతే కాకుండా విదేశాల్లో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసిన షెల్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధవి షేర్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూప్ అవినీతి విచారణలో మాధవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: Most Expensive Tooth: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దంతాలు . . వీటి ధర వింటే అవాక్కవుతారు
SEBI Chief: ఈ కేసులో సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ అవినీతికి పాల్పడ్డారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా అవినీతి నిరోధక సంస్థ లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లోక్‌పాల్ ఫిర్యాదుపై విచారణకు జనవరి 28, 2025న హాజరు కావాలని మాధవి పూరీ బుచ్‌ని ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, ఇతర ఫిర్యాదుదారులకు కూడా జనవరి 28న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.