latest Telugu news: రెండు తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పంజా విసురుతోంది. నిరుడు ఇదే కాలం కంటే ఐదారు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే ఉదయం, సాయంత్ర వేళల్లో చలిగాలులు వీస్తూ దడ పుట్టిస్తున్నది. సాయంత్రం అయిందంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి ఇగం (అతిశీతల గాలి) వీస్తున్నది.
latest Telugu news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 10 నుంచి 30 తేదీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి నిరుటి కంటే మరో 5 డిగ్రీలు తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం అరకు లోయలో 9.1, డుంబ్రిగూడలో 8.6, జీ.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
latest Telugu news: తెలంగాణ రాష్ట్రం చలిగుప్పిట విలవిల్లాడుతున్నది. రాష్టరంలో 31 జిల్లాల్లోని పలుచోట్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం చలి తీవ్రతకు అద్దంపడుతున్నది. గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్-టీలో అత్యల్పంగా 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 8.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 9.4 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.5, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
latest Telugu news: అదే విధంగా నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో 10.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కోట్‌గిరిలో 10.4, కొండపాకలో 10.6, నిర్మల్ జిల్లా పెంబిలో 10.7, వికారాబాద్ జిల్లా మరిపల్లిలో 10.8 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతల చొప్పున నమోదైంది. ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.