KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం పెడతానంటే, స్వయంగా గాంధీ మనుమడే విగ్రహం వద్దు, అదే డబ్బుతో ఏదైనా మంచి పని చేయండి.. అని సలహా ఇచ్చాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి గాడ్సే శిష్యుడని, గాంధీ విగ్రహం పెడుతడాట అని అన్నారు. మూసీమే లూటో, ఢిల్లీకో బాటో.. అంటూ మరో అంశంపై కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలని, మూసీలో డబ్బులు లూటీ చేసి, బ్యాగులను ఢిల్లీకి పంపుతున్నాడని విమర్శించారు.
KTR: దేవుండ్లపై సీఎం రేవంత్‌రెడ్డి వేసిన ఒట్లపైనా కేటీఆర్ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా మోసం చేశాడని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్.. కేంద్ర సహాయ మంత్రి కాదని, రేవంత్ సహాయ మంత్రి అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే.. బీజేపీకి రోషం వస్తుందని ఆరోపించారు. బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా ఉటుందని ధ్వజమెత్తారు.
KTR: రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మల్యే ప్రకాశ్గౌడ్‌పైనా ఆరోపణలు గుప్పించారు. ప్రకాశ్‌గౌడ్ పార్టీ ఫిరాయించి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు.