WI vs ENG

WI vs ENG: ఇంగ్లాండ్ డే టీ20 సిరీస్

WI vs ENG: వెస్టిండీస్ తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ ను ఇంగ్లండ్ గెలుచుకుంది. వరుసగా మూడు టీ20 మ్యాచ్ ల్లో గెలిచి 3-0తో మరో రెండు మ్యాచ్ లుండగానే సిరీస్ ను దక్కించుకుంది. మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో రోమన్ పావెల్ 54, రొమారియో షెఫర్డ్ 30, అల్జారీ జోసెఫ్ 21 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మహమూద్ 3, ఒవర్టన్ 3 వికెట్లతో రాణించారు. 146 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో విల్ జాక్స్ 32, సామ్‌ కరన్‌ 41, లివింగ్‌స్టోన్‌ 39 పరుగులతో పట్టుదలగా ఆడడంతో ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pm modi: ఈ దీపావళి చారిత్రాత్మకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *