KTR: కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటన కేసులో పట్నం నరేందర్ కేటీఆర్ చెప్పడంతోనే ప్రభుత్వ అధికారులపై దాడి చేశాం అని పోలీస్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దానితో పోలీస్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు నమోదు చేశారు. పట్నం నరేందర్ చేపిన విషయాలతో కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు?. దింతో నిన్న నైట్(బుధవారం)కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?
పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!
మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?
50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?
నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!
నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి!
చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో.. అంటూ ‘ఎక్స్’ పోస్ట్‌లో కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి,…
— KTR (@KTRBRS) November 14, 2024