CISF: సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం)లో తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూర్తిగా మహిళలతోనే ఏర్పడే ఈ బెటాలియన్‌లో 1000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉంటారు. ఇటీవల విమానాశ్రయాలు, ఇతర కీలక ప్రదేశాల్లో ప్రముఖుల భద్రతా విధులు సీఐఎస్ఎఫ్‌కు భారంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.