ktr

KTR | జాగో తెలంగాణ.. 11 నెలల కాంగ్రెస్‌ పాలనపై కేటీఆర్‌ ఆగ్రహం

KTR: నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతు. న్నాయి అని అన్నారు. జేబునిండా డబ్బులతో రుబాబ్ గా బతికిన రైతన్నను నేడు చేతికి బేడీలు వేసి ఠాణాల చుట్టూ తిప్పుతున్నారు మండిపడ్డారు.

 నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు వెన్నెముకగా నిలిస్తే .. నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరులో రైతన్న ఆగమైతుండు. నాడు కడుపు నిండా తిని,  కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు .. నేడు ఘడియ ఘడియ గండంగా కంటిమీద కునుకులేకుండా బతుకులీడుస్తున్నాయి కేటీఆర్ అన్నారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్నారు అని వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: KTR: ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తాం..పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్

KTR: రైతులు రైతుబంధు కోల్పోయారు. 

రుణమాఫీ కోల్పోయారు సాగునీళ్లు కోల్పోయారు 24 గంటల ఉచిత కరంటు కోల్పోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లు లేక తండ్లాడుతున్నారు. 

ఆడబిడ్డలు కళ్యాణలక్ష్మి, తులం బంగారం కోల్పోయారు.బాలింతలు అమ్మవడి – కేసీఆర్ కిట్ కోల్పోయారు

గొల్ల, కురుమ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయారు…దళిత సోదరులు దళితబంధు కోల్పోయారు

మత్స్యకార్మిక సోదరులు ఉచిత చేపపిల్లలను కోల్పోయారు

చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారు

విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని కోల్పోయారు-నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారు అని కేటీఆర్ అన్నారు. 

కంటివెలుగు కతమయింది.. ఇంటివెలుగు మాయమయింది.. తెలంగాణ భవిష్యత్ చీకటయింది అన్నారు… జాగో తెలంగాణ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..30 చోట్ల తనిఖీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *