KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని ఆ పిటిషన్‌లో కేటీఆర్ కోరారు. ఏసీబీ గురువారమే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌ను ఆదేశించడంతోనే కేటీఆర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
KTR: ఈ నెల 6న ఏసీబీ పిలుపు మేరకు కేటీఆర్ విచారణకు వెళ్లారు. ఏసీబీ కార్యాలయం బయటే కేటీఆర్ వెంట న్యాయవాదిని పోలీసులు అనుమతించలేదు. దీంతో ఏసీబీ ఆఫీస్ లోపలకు వెళ్లకుండానే ఆయన బయట నుంచే తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు అదేరోజు మరో నోటీస్ జారీ చేశారు. ఆ నోటీస్‌లో గురువారం (9న) విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించింది.