Kerala:కేరళలో ఓ ఉత్సవంలో పాల్గొన్న ఏనుగు ఏకంగా భక్తులపైకి దూసుకొచ్చింది. కొందరిని తొక్కి, మరికొందరిని తొండంతో విసిరిపడేసింది. ఏనుగు దాడిలో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. డప్పు చప్పుళ్లు వాయిద్యాలతో ముస్తాబైన ఏనుగుల ముందు ప్రత్యేక పూజలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐదు ఏనుగుల్లో ఒకటి మాత్రమే భక్తులపైకి దూసుకువచ్చింది. మిగతా ఏనుగుల నుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Kerala:కేరళ రాష్ట్రంలోని మల్లాపురంలోని తిర్రూరు పుతియంగడి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ముస్తాబు చేసిన ఏనుగులను పూజకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఏనుగులను వరుసగా ఉంచి పూజలు నిర్వహిస్తుండగా, అందులోని ఒక ఏనుగు ఉన్నట్టు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకొచ్చింది. తన తొండంతో ఒకరిద్దరిని విసిరేయగా, మరికొందరిని తొక్కుకుంటూ వెళ్లింది.
Kerala:వెంటనే ఆ ఏనుగు మావటిలు ఆ ఏనుగును సముదాయించడంతో శాంతించింది. లేకుంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించేది. గాయపడిన 17 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషయమంగా ఉన్నట్టు సమాచారం.