Crime News: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో ఈ నెల 7న జరిగిన దాది కోటేశ్వరమ్మ అనే మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను చంపి, నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో మొదట ఇదొక దోపిడీ హత్యగానే అంతా భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అత్యంత విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు ప్రేమ వివాహానికి అడ్డుపడుతోందన్న కక్షతోనే పథకం ప్రకారం ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు.
అసలేం జరిగింది? – హత్యకు దారితీసిన కారణాలు..
కేసు నమోదు చేసుకున్న పెదకాకాని పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల కదలికల ఆధారంగా కూపీ లాగడంతో మరియకుమారి, ఆమెకు సహకరించిన ఇద్దరు యువకుల బండారం బయటపడింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్య తర్వాత ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
