KTR: మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవులు చెప్పులి..

KTR::తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో, రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

“మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి” అంటూ రేవంత్ రెడ్డి డైలాగులు కొడతాడు. కానీ అదే చెడు చెవిలో చెబితే రక్తం కారుతుంది. యాది పెట్టుకో రేవంత్ రెడ్డి!” అంటూ హెచ్చరించారు.

నిన్న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సమావేశం నిర్వహించగా, కొత్త పార్టీ ఇంచార్జీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. “మంచి మైకులో చెప్పాలంటే, నువ్వు చేసిన మంచి పని లేదు. మైకుల్లో మంచి చెప్పుదామన్న కరెంట్ కట్ అయిపోతుంది. చెడు చెవిలో చెప్పడం మొదలుపెడితే, హైద్రాబాదు నుంచి మొదలు పెట్టాలి. ఆర్‌ఆర్‌ టాక్స్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్ హౌస్ గురించి చెబితే నీ చెవిలో రక్తం కారుతుంది రేవంత్ రెడ్డి… యాది పెట్టుకో!” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

కొత్త ఇంచార్జ్ మీనాక్షి మాట్లాడుతూ, “రైల్వేస్టేషన్‌లో దిగగానే బ్యాగులు మోసేందుకు కొంత మంది కాంగ్రెస్ నేతలు ఉరికొచ్చారు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకునేలా బ్యాగులు మోసుకోవద్దని చెప్పాను. కానీ మీ పక్కన కూర్చున్న వ్యక్తి బ్యాగులు మోస్తూ మోస్తూ గాడికి వచ్చాడు. ఆయనను పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటే ఆ మేడం ఏమనాలి?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

కేటీఆర్ తన మాటలను కొనసాగిస్తూ, “రేవంత్ రెడ్డి మాటలు, కథలు చెప్పడం మానుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ ఇన్నేళ్లలో ఒక్క మంచి పని కనిపించడంలేదు. ఈ 15 నెలల్లో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే, ఏ ఒక్క మహిళకైనా పలు కరించినా రేవంత్‌ను తిడుతున్నారు. తెలుగులో ఇన్ని తిట్లు ఉంటాయా అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నిజమైన ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి మంచి పనులు చేసి చూపించాలి. లేదంటే ఆ డైలాగులు అనవసరం” అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలుచేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: స్టేషన్ లో మనోజ్..SON అఫ్ ఇండియా పై సన్ కంప్లంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *