Ktr: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఏర్పడిన ప్రయోజనాల గురించి తెలిసిందేనని, అయితే దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు.
సోమవారం కాళేశ్వరం వ్యవహారంపై ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఎదుట మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ప్రాజెక్టుపై తమ ప్రభుత్వ స్థైర్యమైన వైఖరిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
“ఇది చరిత్రలో నిలిచే ప్రాజెక్టు!”
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే ఏ దేశానికైనా మణికట్టు అయేది, కానీ భారతదేశంలో మాత్రం రాజకీయ పార్టీలు దీన్ని లజ్జాస్పదంగా మార్చేశాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏకైక వ్యక్తి నిర్ణయం కాదు. మంత్రివర్గ ఆమోదంతో, ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం. దీనిని అమలు చేయడం అధికార యంత్రాంగ బాధ్యత’’ అని వివరించారు.
ఆరోపణలు అసత్యం – విచారణకు అభ్యంతరం లేదు
ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలేమి జరగలేదని, దాచిపెట్టాల్సిందేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘అయినా బేధభావాలతో నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు. హరీశ్ రావు కమిషన్ ఎదుట అన్ని అంశాలను సమగ్రంగా వివరించారు. ఇక కేసీఆర్ చెప్పాల్సిందేం లేదు’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు – మీడియా మేనేజ్‌మెంట్‌లోనే బిజీ
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేటీఆర్, ‘‘విధ్వంసకర పాలన కొనసాగుతోంది. రాష్ట్రాన్ని సంక్షోభానికి గురిచేస్తున్నారని” విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు భయపడరని, రేవంత్ రెడ్డి మాత్రం మీడియా హైప్‌తో మోదీ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.