Krithi Shetty: ‘ఉప్పెన’తో ఒక్క సారిగా టాలీవుడ్ లోకి దూసుకు వచ్చిన బ్యూటీ కృతిశెట్టి. అయితే ఆ తర్వాత రాంగ్ స్టెప్స్ తో స్టార్ డమ్ పోగొట్టుకున్న కృతిశెట్టి ఇటీవల మలయాళంలో ‘ఎఆర్ఎమ్’ సినిమాతో సాలీడ్ హిట్ పట్టేసింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్న కృతిని బాలీవుడ్ రా రమ్మని పిలుస్తోందట. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ సినిమా రీమేక్ కోసం దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్.కె.ఎన్ కృతిని సంప్రదించారట. వైష్ణవి చైతన్య లీడ్ రోల్ చేసిన ‘బేబీ’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించి రివార్డులతో పాటు పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారానే సాయిరాజేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ హీరో హీరోయిన్స్ గా స్టార్ కిడ్స్ ను ట్రై చేస్తున్నారు.
Krithi Shetty: ఇషాన్ కట్టర్, ఆర్యమన్ డియోల్ అగస్త్య నంద వంటి స్టార్ కిడ్స్ తో పాటు ఖుషీ కపూర్ పేరు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బబిల్ ఖాన్ ని ఓ పాత్రకోసం ఫిక్స్ చేశారట. హీరోయిన్ గా కృతి శెట్టి కన్ ఫామ్ అనే వార్తలు వస్తున్నాయి. ఐదేళ్ళ క్రితం బాలీవుడ్ మూవీ ‘సూపర్ 30’లో స్టూడెంట్ గా మెరిసిన కృతిశెట్టి ఇప్పుడు ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగు పెట్టనుందన్న మాట. మరి తెలుగులో తొలి చిత్రం ‘ఉప్పెన’ లాగే బాలీవుడ్ లోనూ ‘బేబీ’ రీమేక్ తో సూపర్ హిట్ పట్టేస్తుందేమో చూడాలి.