Kommineni Srinivas Rao: ప్రముఖ జర్నలిస్ట్, వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాస్‌రావును మహిళలను కించపరిచిన వ్యాఖ్యలపై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.
ఇటీవల కొమ్మినేని శ్రీనివాస్ ఓ డిబేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు జరగడంతో పోలీసు శాఖ కార్యాచరణలోకి దిగి కేసు నమోదు చేసింది.
హైదరాబాద్‌లో అదుపులోకి
హైదరాబాద్‌లో ఉన్న కొమ్మినేనిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, కేసు నిమిత్తం విజయవాడకు తరలించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: SUGAVASI FAMILY STORY: 40 ఏళ్ల సైకిల్ ప్రయాణానికి బ్రేకులు పడింది ఎక్కడ?
మహిళా సంఘాల తీవ్ర ప్రతిస్పందన
కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “ఇది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంది. అలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోను సహించలేము” అని సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
దర్యాప్తు కొనసాగుతోంది
అధికారుల ప్రకారం, కేసు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. డిబేట్ వీడియోలు, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన క్లిప్‌లను ఆధారంగా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.